గుడ్ న్యూస్.. రేపు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపీణి

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపీణి
డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపీణి

నవతెలంగాణ – హైద‌రాబాద్ : హైదరాబాద్‌ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు కానుకగా అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మహా క్రతువును వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేలాది ఇళ్లను నిరుపేదలకు అందించింది ప్ర‌భుత్వం. నిర్మాణాలు పూర్తి చేసుకున్న‌ 70 వేల డబుల్‌ బెడ్రూం ఇళ్లను అర్హులైన‌ పేదలకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా శనివారం ఒకే ఒక్కరోజు ఏకంగా 11,700 డబుల్‌ బెడ్రూం ఇళ్లను గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సుమారు 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన దరిమిలా వారికి ఇళ్లను పంపిణీ చేసేందుకుగాను జీహెచ్‌ఎంసీ పరిధిలో తొమ్మిది ప్రాంతాలను వేదికగా ఏర్పాటు చేశారు. ఏడుగురు రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీక‌ర్, జీహెచ్ఎంసీ మేయర్‌.. ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన 11,700 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లను లాటరీ ద్వారా కేటాయింపు చేయనున్నారు.

Spread the love