తుమ్మల నివాసానికి సీఎల్పీ నేత భట్టి

నవతెలంగాణ -హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక రాజకీయ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి కాంగ్రెస్ సీఎల్పీ భట్టి విక్రమార్క వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానం పలికారు. ఈ తరుణలో అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాగా నిత్యం ప్రజాజీవితంలో ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అని భట్టి విక్రమార్క కొనియాడారు. ఇదిలావుండగా.. భట్టి ఆహ్వానానికి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. నలబై ఏళ్లుగా తనను ఇంతటి వాడిని చేసిన అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల అన్నారు.

Spread the love