
నవతెలంగాణ హైదరాబాద్: ఆర్టీసీ బిల్లుపై న్యాయసలహా కోరుతూ గవర్నర్ తమిళసై న్యాయశాఖకు పంపారు. దానితో పాటు ఇతర బిల్లులను కూడా న్యాయశాఖ కార్యదర్శికి పంపారు. న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా చర్యలుంటాయన్న రాజభవన్ తెలిపింది. ఆర్టీసీ బిల్లుపై దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు అని గవర్నర్ ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.