కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే నేతన్నల జీవితాలు మారాయి

– మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను గెలిపించుకుందాం
– సిరిసిల్ల మానేరు వాగులో 365 రోజులు నీరు ఉంటుంది
నవతెలంగాణ- సిరిసిల్ల రూరల్
శిరీషాలగా పేరు ఉన్న సిరిసిల్లలో గత పాలనలో నేతన్నల ఆత్మహత్యలతో ఉరిశాలగా మారింది తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే నేతన్నల జీవితాలు సిరులతో కలకలలాడేలా మార్చి వేశారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు సిరిసిల్లలోని మంగళవారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సిరిసిల్ల మానేరు వాగులో 365 రోజులు నీరు కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు వేదికపై ముఖ్యమంత్రిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సార్ మిమ్మల్ని ఎక్కువ అడిగేది ఏం లేదని అడగకుండానే సిరిసిల్లకు మీరు అన్ని ఇచ్చారని రాబోయే రోజుల్లో ఆడబిడ్డలు అన్నదమ్ముల ఆశీర్వాదాలతో తప్పకుండా గులాబీ జెండా ఎదురు వేస్తామని కారు గుర్తుకే సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు ఓటు వేస్తారని మీ నాయకత్వాన్ని మరోసారి గెలిపిస్తారని మూడవసారి ముచ్చటగా ఐంటికి ముఖ్యమంత్రిగా సిరిసిల్ల నుంచి ఇక్కడి ప్రజల  ఆశీర్వాదం ఇస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు కలలో కూడా ఊహించని సంక్షేమం అభివృద్ధి ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బ్రహ్మాండమైన సంక్షేమం బ్రహ్మాండమైన అభివృద్ధి ఈరోజు మన కళ్ళకు కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు ఎర్రటి ఎండలో ఏప్రిల్ నెలలో మన అప్పర్ మానేరు మత్తడి దూకుతుందని దీని కారణం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నానని ప్రజలను ఉద్దేశించి మంత్రి పేర్కొన్నారు కాలేశ్వరం జలాల ద్వారా గోదావరి నీళ్ల ద్వారా మల్లన్న సాగర్ నింపి అక్కడి నుంచి కూడా వెళ్లి వాగు ద్వారా ఈరోజు బ్రహ్మాండంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన వ్యవసాయ భూములకు మల్లుతున్నాయంటే దీనికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు

Spread the love