కేంద్రంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రంపై  సంచలన వ్యాఖ్యలు
కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ మన్నెగూడ: చేనేత మీద ప్రధాని మోడీ 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటివరకు ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. చేనేత వద్దు.. అన్నీ రద్దు అనేలా కేంద్రం తీరు ఉంది. కేంద్రానికి నేతన్నల గురించి తెలియదు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది’’ అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. 75 ఏండ్లు దాటిన చేనేతల కార్మికులకు ప్రభుత్వమే బీమా కల్పిస్తుందని రాష్ట్ర పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో పాల్గొన్న  మంత్రి మాట్లాడుతూ.. ‘‘ కొత్త మగ్గాలకు తెలంగాణ చేనేత మగ్గం అని పేరు పెట్టాం. నేతన్నలకు 16 వేలకుపైగా కొత్త మగ్గాలు ఇవ్వబోతున్నాం. నేటి నుంచే తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలవుతుంది. ₹40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్‌ మగ్గాలు అందుబాటులోకి తెస్తాం. కేసీఆర్‌ ఎప్పుడూ టాటాలు మాత్రమే కాదు.. తాతలు మెచ్చిన కుల వృత్తులు ఉంటేనే అభివృద్ధి అంటారు. చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్‌ ద్వారా ₹200కోట్ల క్యాష్‌ క్రెడిట్‌ లిమిట్‌ అందించనున్నాం. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు ₹3వేలు ఇస్తాం. ఈ పథకం ఆగస్టు, సెప్టెంబర్‌ నుంచి అమలు చేస్తాం“ అని అన్నారు.

 

Spread the love