మండలాధ్యక్షుడిని మార్చేద్దామా?

– సామాజిక మాద్యమంలో అసంతృప్తి వెల్లడించిన పలువురు బీఆర్ఎస్ శ్రేణులు 
– పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి గుర్తింపులేదని అసహనం 
నవతెలంగాణ-బెజ్జంకి 
ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అవిర్భవించిన నాటి నుండి రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల వరకు పార్టీ సిద్దాంతం ప్రకారం నిబద్ధతతో పని చేసిన  శ్రేణులకు తగిన గుర్తింపు లేదని..ఇతర పార్టీల నుండి వచ్చిన వారే కీలకంగా వ్యవహరిస్తున్నారని .. ఎనాటికైనా క్రియాశీలక శ్రేణులు పార్టీ జెండాలు మోసే స్థాయిలోనే ఉండాల్సిన దుస్థితి నెలకొందని పలువురు బీఆర్ఎస్ శ్రేణులు సామాజిక మాద్యమం వేదికగా అసహనం వెల్లడించినట్టు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తెలిపారు. భారత రాష్ట్ర సమితి బీజేకే సామాజిక మాద్యమం గ్రూపులో మరి మండలాధ్యక్షుడిని మార్చేద్దామా? అనే విధంగా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం మండల నాయకులపై తీవ్ర అసంతృప్తికి నిదర్శనంగా నిలుస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమయం వరకు బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత అసంతృప్తి పెరిగి ఎంపీ అభ్యర్థిపై తీవ్ర ప్రభావం చూపుతారని ఇప్పటికైనా బీఆర్ఎస్ జిల్లా బాధ్యులు మండల బీఆర్ఎస్ కార్యవర్గాన్ని చక్కదిద్దాలని లేనిపక్షంలో ఎమ్మెల్యే ఎన్నికల పలితాలు పునారావృతమవుతాయని పలువురు బీఆర్ఎస్ శ్రేణులు సూచిస్తున్నారు.
Spread the love