నేడు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం విధానంలో ఈడీ, సీబీఐలు కవితపై నమోదు చేసిన అభియోగాలు కుట్రపూరితం, తప్పుడు కేసులు అని ఆరోపించిన కవిత రౌస్‌ అవెన్యూ కోర్టులో బెయిల్‌ కోసం ప్రయత్నించిన విషయం విదితమే. గురువారం 1,149 పేజీలతో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కింది కోర్టులో న్యాయం దక్కకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు.

Spread the love