నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి

– ప్రభుత్వ క్యాంప్‌ కార్యాలయంలో పాస్టర్లతో సమావేశం
– బీఅర్‌ఎస్‌కు మద్దతివ్వాలాంటు ప్రార్థనలు
– ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్‌ నేతలు
– ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గానికి దూరంగా ఉంచాలని విజ్ఞప్తి
నవతెలంగాణ-పటాన్‌చెరు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాస్టర్లతో సమావేశం నిర్వహించిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవా లని కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఈసీని కోరారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఎన్నికల కోడ్‌ను ఉల్లంగించాడంటూ శనివారం కాంగ్రెస్‌ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో పాటు, ఈసీకి మెయిల్‌ ద్వారా ఫిర్యా దు చేశారు. అనంతరం ఎన్నికల కార్యాలయం ఎదుట నిరస న తెలిపారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడు తూ.. ప్రభుత్వ క్యాంప్‌ కార్యాలయంలో బీఆర్‌ఎస్‌కి మద్దతు ఇవ్వాలంటూ చర్చి పాస్టర్లతో ప్రార్థనలు నిర్వహించి కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. మతాల వారిగా సమావేశాలు నిర్వహించి ప్రమాణం చేయించి ఎన్ని కల్లో లబ్ది పొందాలని చూడడం సరికాదన్నారు. మే 4న పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి క్రిస్టియన్లను మభ్యపె ట్టడంతో పాటు ఈద్‌ ఉల్‌ మిలాప్‌ కార్యక్రమం ద్వారా ముస్లి ంలను ఆకట్టుకునే కుటిల ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మతాల ద్వారా ప్రజల సెంటిమెంట్లను అడ్డం పెట్టు‌కుని పార్లమెంట్‌ ఎన్నికల్లో లాభపడాలని చూడడం సిగ్గుచేట న్నారు. ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మహి పాల్‌ రెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఎన్నికలు అయ్యే వరకు పార్లమెంట్‌ పరిధిలో ప్రచారంలో పాల్గొనకుండా బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి సామయ్యా,పట్టణ కార్యదర్శి అబ్దుల్లా పాషా,ఏఐటీయూసీ కార్యదర్శి ప్రసాద్‌, ఎట్టయ్య, హామీద్‌, రమేష్‌, రవి, సాయిలు, ఆసిఫ్‌, సునంద, జ్యోతి, వెంకట్రావ్‌, కిషన్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love