నిప్పుంటూకుని ఈత తాటి వనం దగ్ధం 

– గీత కార్మికులకు న్యాయం చేయాలి 
– గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పచ్చిమట్ల రవీందర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పొట్లపల్లి గ్రామాల సరిహద్దులోని ఈత తాటి చెట్ల వనానికి ప్రమాదవశాత్తు  నిప్పుంటూకుని ఈత తాటి వనం దగ్ధం ఐన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గీత కార్మిక సంఘం నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గీత కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ  హుస్నాబాద్  పట్టణ కల్లు గీత కార్మిక సంఘం కు  చెందిన వారి యొక్క సొంత భూమి 10, ఎకరంల తాటి ఈత వనం  దాదాపు 20 ఏళ్లు వయసున్న  చెట్లు  ఉన్నాయి.నిప్పుంటూకోవడం తో కల్లుగీత కార్మికులకు  తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. ఇట్టి విషయంలో విచారణ చేసి  గీతా కార్మికులకు న్యాయం చేయాలని    తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు   పచ్చిమట్ల రవీందర్ గౌడ్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు, వేల్పుల రాజు, గౌడ సంఘం నాయకులు  తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, కోయిడ శ్రీనివాస్ గౌడ్, పాకాల సమ్మయ్య గౌడ్,  పచ్చిమట్ల పెద్ద రవి, పూదరి శ్రీనివాస్, పూదరి రవీందర్ గౌడ్, పూదరి కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love