గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

– ధర్మ సమజ్ పార్టీ నాయకులు ఎంపీడీవో వినతి

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని శనివారం ధర్మ సమజ్ పార్టీ నాయకులు హుస్నాబాద్ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ సిబ్బంది ,కార్మికులకు జీతాలు లేక  ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు . వెంటనే నిధులు విడుదల చేసి కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు చెంచల ఎల్లన్న, మండల నాయకులు సతీష్ పాల్గొన్నారు.
Spread the love