గ్రామాలలో తాగునీటి ఎద్దడి నివారణకై ప్రత్యేక చర్యలు చేపట్టాలి

– మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్

నవతెలంగాణ – రెంజల్
ఈ ఏడాది ఎండలు బండి పోతుండడంతో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి ఎద్దడి నివారణ కోసం అధికారులు, గ్రామ కార్యదర్శులు ప్రత్యేక చర్యలను చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రజలకు తాగునీటిని అందించే బాధ్యతను అధికారులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. శనివారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మధ్యాహ్నం తాగునీటి నివారణకై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటిని పొదుపుగా వాడే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. వేసవిలో మోటర్లు తరచుగా కాలిపోయే ప్రమాదం ఉన్నందున అదనంగా మోటార్లను జిపి లలో భద్రపరచుకోవాలని ఆయన సూచించారు. నీటి సమస్యలు తలెత్తకుండా గ్రామ ప్రత్యేక అధికారులతో పాటు, కార్యదర్శులు సత్వర చర్యలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి రానున్నట్లు, ప్రతిరోజు ఆయన జిల్లాలోని గ్రామాలను ఆకస్కంగా తనిఖీలు చేసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎండి కలీం, ఎంపీడీవో శంకర్, ఎంపీఓ గౌస్ ఉద్దీన్, మిషన్ భగీరథ డి ఈ ముని నాయక్, సూపరిండెంట్ శ్రీనివాస్, గ్రామ ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
Spread the love