భారత ప్రజల గుండెల్లో సజీవంగా బాబు జగ్జీవన్ రామ్ 

– మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
బ్రిటిష్ శత్రువులను మట్టి కరిపించి భారతదేశానికి విజయాన్ని సాధించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించిన బాబు జగ్జీవన్ రామ్ ను భారత ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉంచుకున్నారని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, కౌన్సిలర్లు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి,  కౌన్సిలర్లు  కొoకటి నలిని దేవి రవి, భోజు రమాదేవి రవి, కోమటి స్వర్ణలత సత్యనారయణ , పెరుక భాగ్య రెడ్డి, పున్న లావణ్య సది, చిత్తరి పద్మ రవి, దోడ్డి శ్రీనివాస్ ,బోల్లి కల్పన శ్రీనివాస్, వల్లపు రాజు, బొజ్జ హరీష్ ,వాల సుప్రజ నవీన్ రావు  , కో ఆప్షన్ మెంబెర్స్ ఐలేని శంకర్ రెడ్డి, యండి ఆయూబ్, బొల్లం శ్రీలత, బాల ఎల్లం ఎస్సై, శివ, గడిపేసారయ్య, ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love