పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చూడాలి

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో తాగునీటి సమస్యలు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శనివారం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో తాగునీటి సమస్యలపై ఇంజనీరింగ్ అధికారులు, వార్డ్ ఆఫీసర్స్, వాటర్ సప్లై సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అధికారులందరూ వార్డులోని ప్రతి ఇంటికి త్రాగునీరు వస్తుందో లేదో చూడాలని సూచించారు. ఏమైనా వాటర్ పైప్స్ , పవర్ బోర్స్ మరియు హ్యాండ్ బోర్స్ లీకేజీ ఉంటే  అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ , అసిస్టెంట్ ఇంజనీర్ సాయి ప్రణీత్ , వార్డ్ ఆఫీసర్లు, వాటర్ సప్లై సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love