నవభారత్ లో ఉగాది సంబరాలు

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో సోమవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత హాజరై విద్యార్థులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని అందరూ ఆనందంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గంగరవేణి రవి, డైరెక్టర్లు వేల్పుల శ్రీనివాస్, గంగరవెని రాజు, పాఠశాల ప్రిన్సిపల్ వినీష్ కుమార్ , ఇంచార్జి జయ టీచర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love