– లోహిత్ సాయి హాస్పిటల్స్ డాక్టర్ భాస్కర్
నవతెలంగాణ – సిద్దిపేట
అవసరం ఉన్నవారికి చేయూతనందించాలన్న సంకల్పంతోనే స్కూల్ బ్యాగ్స్ వివిధ వస్తువులను అందించడం జరిగిందని లోహిత్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ భాస్కర్ అన్నారు. గురువారం సిద్దిపేట లయన్స్ భవన్ లో లోహిత్ సాయి హాస్పిటల్, మ్యాన్ కైన్డ్ ఫార్మా సంయుక్త ఆధ్వర్యంలో 54 మంది అభయ జ్యోతి మనోవికాస కేంద్రం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానసికంగా ఎదుగుదల లేని ఈ విద్యార్థులకు ఏదో చేయాలన్న తపన నాకు ఎంతో కాలంగా ఉండేది అన్నారు. మ్యాన్ కైండ్ ప్రతినిధులతో కలిసి 25వేల విలువగల వాటిని విద్యార్థులకు సమకూర్చడం ఆనందంగా ఉందన్నారు. తాము అందించిన చేయూతను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు వైద్య పరమైన సహయాలు నిరంతరం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మ్యాన్ కైండ్ ప్రతినిధులు తిరుమలేష్, వినయ్, అభయ జ్యోతి వ్యవస్థాపకులు జోజి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు గంప రమేష్, సుభాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.