జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా: మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు 

– ఇప్తార్ విందులో పాల్గొన్న హరీశ్ రావు,వెంకట్రామిరెడ్డి
నవతెలంగాణ – సిద్దిపేట 
జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని మాజీ మంత్రి,  ఎమ్మెల్యే  హరీశ్ రావు అన్నారు.  జిల్లా కేంద్రంలోని నిమ్రా గార్డెన్ లో ఆదివారం జరిగిన దావతే ఇప్తార్ విందులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గంగా జమున తహజీద్ కు కేంద్ర బిందువు అని అన్నారు. నాటి ఎమ్మెల్యేలు మదన్మోహన్, కేసీఆర్ కాలం నుండే  ఇక్కడి ప్రజలు సోదరీబావంతో కలిసి మెలిసి ఉంటారని అన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.రాష్ట్రంలోనే తొలిసారిగా ఆఖరి సఫర్ అనే అంతిమా యాత్ర వాహనాన్ని సిద్దిపేట లోనే అందుబాటులోకి తేవడంతో పాటు, డెడ్ బాడీలను నిల్వ ఉంచడానికి అన్ని మస్జీద్ లలో ఫ్రీజర్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
నా సొంత డబ్బులతో సిద్దిపేట ముస్లింల కోసం ఎన్సాన్పల్లిలో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేసి,  బోరు మోటర్ ను వేసి, పెన్సిలింగ్ చేసి గేటు పెట్టి ఇచ్చాను,   నేడు ఆ భూమికి కోట్ల విలువ వచ్చిందన్నారు. నిరుపేద ముస్లిం మహిళల ఉపాధి పొందాలన్నా లక్ష్యంతో నా సొంతంగా కుట్టు మిషన్లను అందించానని, ప్రతి ఏటా నా సొంత డబ్బులతో పదిమంది నిరుపేదలకు ఉమ్రయాత్రను పంపిస్తున్నానని అన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో పండుగ రోజున నమాజు వేళలో  ప్రజలకు ఇబ్బంది కలగకుండా సిద్దిపేట మున్సిపాల్ పాలకవర్గం సహకారంతో పూర్తి సదుపాయాలను  ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇఫ్తార్ విందులో  మెదక్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి  వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, తంజిం ప్రతినిధులు,ముస్లిం మత పెద్దలు  అబ్దుల్ సమీ, ఆసిఫ్, అబ్దుల్ వహీద్, జావీద్, తహెర్,ప్రజా ప్రతినిధులు, నాయకులు కడవేరు రాజానర్సు, వేలేటి రాధాకృష్ణ శర్మ, గుండు భూపేష్, పాల  సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వజీరుద్దీన్, ఫక్రుద్దీన్, మోయిజ్ , నాగరాజు రెడ్డి, మల్లికార్జున్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Spread the love