అభివృద్ధి.. అండ కలిపితే హరీశ్ రావు

నవతెలంగాణ – సిద్దిపేట
అపర భగీరథుడు , నిరంతర కృషివరులు , తెలం గాణ రాష్ట్ర సాధనలో అలుపెరగని బాటసారి , అభివృద్ధి సాధకుడు , ఓటమి ఎరుగని దీశాలి , ట్రబుల్ షూటర్ గా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేరొందారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ .. ప్రజా మన్నలను పొం దుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, తనను నమ్ముకుని వివిధ పనులపై వచ్చే ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ హరీశ్ అన్నగా నిలిచారు. సొంత పార్టీలోనే కాకుండా ఇతర పార్టీ నేతల నుంచి కూడా మన్ననలను అందుకున్న ఏకైక నాయకుడిగా హరీశ్ రావు గుర్తింపు పొందారు. నమ్మిన సిద్దాంతంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కుడిభుజంగా, నవ రాజకీయ చైతన్య దీప్తిగా ఉన్నారు.
నేడు మంత్రి హరీశ్ రావు జన్మదినం సంద ర్భంగా ప్రత్యేక కథనం…
2004 లో తొలిసారిగా సిద్దిపేట శాసనసభ నియోజక వర్గం నుంచి హరీశ్ రావు ఎన్నికయ్యారు. వై.ఎస్ . రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో యువజన సర్వీ సులు , ప్రింటింగ్ స్టేషనరీ శాఖ మంత్రిగా పనిచేశారు.
సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్ జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24,827 ఓట్ల మెజార్టీతో గెలు పొందాడు. 2008లో జరిగిన ఎన్నికలలో 58,935 మెజార్టీతో గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికలలో 64, 677 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2010లో 95, 878 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో 93, 328 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని అత్యధికంగా 1 లక్ష 20 వేలు మెజార్టీతో గెలుపొందారు. ఎప్పుడు పోటీ చేసిన ఎన్నికలలో తన ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా వారి డిపాజిట్లను గల్లంతు చేశారు.
మంత్రివర్గంలో స్థానం….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే 2004 – 2005 సంవత్సరంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014- 2018 మధ్యకాలంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. 2019 నుండి ఇప్పటివరకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు.
పదవులకే వన్నెతెచ్చిన దిశాలి…
హరీశ్ రావు తాను ఏ పదవులు చేపట్టిన ఆ పదవులకే వన్నె తీసుకువచ్చే వ్యక్తి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రోజుకు 20 నుండి 21 గంటల పాటు పనిచేస్తూ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. కాలేశ్వరం నుండి కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు ఎప్పుడూ పనులు పర్యవేక్షిస్తూ , అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ప్రాజెక్టు నిర్మాణంలో అల్పు ఎరుగకుండా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని శాఖలకు ప్రాతినిధ్యం వహించే విధంగా నిధులను కేటాయించి, తన తోటి మంత్రుల అభిమానాన్ని పొందారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించే విధంగా విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చారు. ఈ మధ్యనే మహిళలకు ప్రతి మంగళవారం కొన్ని ప్రత్యేకంగా ఎన్నుకున్న ప్రభుత్వ ఆసుపత్రులలో, చికిత్సలను అందిస్తూ మహిళల పక్షపాతిగా నిలిచారు. ఇలా తను ఏ బాధ్యతలు చేపట్టిన ఆ బాధ్యతలకు వన్నె తెచ్చే విధంగా పనిచేశారు. సిద్దిపేట నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ, ప్రజలకు ఒక పెద్ద అన్నగా , ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. ఇలానే సేవ చేస్తూ, నిండు నూరేళ్లు జీవించాలని ప్రజలు మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా ఆశీర్వదించారు.

Spread the love