మనువాదాన్ని ఓడిద్దాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

– పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి
– మెదక్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పున:స్థాపించాలి
– డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌
నవతెలంగాణ-మెదక్‌
మనిషిని మనిషిగా చూడలేని మనువాదాన్ని ఒడించి ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని అందిస్తున్న భారత రాజ్యాం గాన్ని కాపాడుకోవాలని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం మెదక్‌ పట్ట ణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో డిబిఎఫ్‌ అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ మహనీయులైన పూలే, అంబేద్కర్‌, జగ్జీవన్‌ రామ్‌ల జయంతి మహత్సోవం సంద ర్భంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమాన్ని చేపట్టామని తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆస్తులు, సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరం చేసిం దన్నారు. మానవ హక్కులను అందించిన రాజ్యాంగాన్ని 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదేపదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్ధం చేసుకొని రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీజేపీని ఓడించి రాజ్యాం గాన్ని రక్షించుకోవాలన్నారు. గత పదేళ్లుగా మోడి ఇచ్చిన ఏ హమిని నేరవెర్చలేదన్నారు. అలాగే మెదక్‌ పట్టణంలో ముం దుగా ఉన్న అంబేద్కర్‌ విగ్రహాన్ని తీసివేసి ఇప్పటివరకు పున:స్థాపించకుండా ఉండడం సిగ్గుచేటన ా్నరు. వెంటనే మెదక్‌ పట్టణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె. మల్లేశం, దళిత నేతలు రామస్వామి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు బాల్‌ రాజు, బీసీ సంఘం నాయకులు మొహన్‌, సంజివ్‌, ఇసాక్‌, డిబిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మకొండ దయాసాగర్‌, జర్నలిస్టు నాగరాజు, నర్సింలు, పోషయ్య, కుమార్‌, ప్రభు, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love