కలహాలొదిలి.. కలిసిపోయేరా!

– ట్రబుల్స్‌ మధ్య డబుల్‌ సూటర్స్‌గా ఎలా సాధ్యం
– చెంప చెల్లుమనిపించేంత భాద..అయినా సహారించేరా
– పటాన్‌చెరు నియోజకవర్గంలో ‘కాట’ కనికరిస్తే మెజార్టీ
– పార్టీలో కొత్త…నాయకులతో సంబంధాలూ కొత్తే
– కాంగ్రెస్‌లో ఓడిన వాళ్లే నియోజకవర్గ ఇంచార్జీలు
– చేతినిండ పైకమిస్తే తప్ప కదిలే పరిస్థితి ఏదీ
– నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయప్రతినిధి
– వైరం వీడేనా…సయోద్య కుదిరేనా..?
నువ్వా నేనా అంటూ తలపడిన ఆ ఇద్దరు నేతలు కలహాలు వదిలి కలిసిపోయేరా..? అనేక ట్రబుల్స్‌ మధ్య డబుల్‌ సూటర్స్‌గా మారడం సాధ్యమేనా..? చెంప చెల్లుమనిపించేంత కోపం, బాధ… అయినా సహాకారం అందించడం జరుగుతుందా..? పార్టీలో కొత్త… నాయకులతో సంబంధాలూ కొత్తే. ఆరు నియోజకవర్గాల్లో ఓడిన నాయకులే ఇంచార్జీలు. చేతినిండా పైకమిస్తే తప్ప కదిలి పనిచేసేదుండదు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి నెట్టుకురావడం మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు అగ్ని పరీక్ష అనక తప్పదు. కీలకమైన పటాన్‌చెరు నియోజకవర్గంలో కాట శ్రీనివాస గౌడ్‌ సంపూర్ణంగా సహాకరిస్తే తప్ప అక్కడ మెజార్టీ సాధించడం కష్టమే. మెదక్‌, దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి నియోజకవర్గాల్లో లీడర్లను మచ్చిక చేసుకుంటే తప్ప క్యాడర్‌ మద్దతు దొరకదు. ఇలాంటి పరిస్థితుల్ని అధిగమించి నీలం మధు ఏ మేరకు సఫలీకృతమవుతారో వేచి చూడాలి.

మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్న నీలం మధుకు పార్టీలోనే ఎదురీత తప్పట్లేదు. బీఆర్‌ఎస్‌లో పనిచేసిన మధు పటాన్‌చెరులో కాంగ్రెస్‌ నాయకులు కాట శ్రీనివాస గౌడ్‌కు వ్యతిరేకంగా పనిచేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఢిల్లీలో మకాం వేసి తీవ్రంగా ప్రయ త్నం చేశారు. కాట శ్రీనివాస్‌కు కాకుండా తనకు టికెట్‌ ఇవ్వా‌లని సీఎం రేవంత్‌రెడ్డి ఇతర నాయకుల అండతో ప్రయ త్నించారు. తీరా దామోదర రాజనర్సింహ పట్టుపట్టి తన అనుచరుడైన కాట శ్రీనివాస్‌ గౌడ్‌కే ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించుకున్న విషయం విథితమే. కాంగ్రెస్‌లోనే ఉండి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిన కాట గెలుపు కోసం పనిచేయాల్సిన నీలం మధు పార్టీని వీడది బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి 40 వేల ఓట్లు సాధించారు. ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారడం, నీలం మధుకు భారీ ఓట్లు రావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి కాట శ్రీనివాస్‌ గౌడ్‌ ఓటమికి దారి తీసింది. కొద్ది పాటి ఓట్ల తేడాతోనే కాట ఓటమిపాలయ్యారు. దీంతో కాట శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరగణం తీవ్ర మనోవేదనకు గురైంది. కాట కుటుంబం సైతం నీలం మధు వల్లనే ఓడిపో యామంటూ బహిరంగంగానే ప్రకటించింది. ఓటమి బాధను మర్చిపోకముందే నీలం మధును కాంగ్రెస్‌లో తిరిగి చేర్చుకుని ఏకంగా ఎంపీ టికెట్‌ ఇచ్చారు. ఇదంతా కాట శ్రీనివాస్‌ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. ఇంతలోనే జిల్లా ఇంచార్జీ మంత్రి కొండ సురేఖ మధ్యవర్తిగా రంగంలోకి దిగి నీలం మధు, కాట శ్రీనివాస్‌ గౌడ్‌ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. నీలం మధును వెంట తీసుకొని ఏకంగా కాట శ్రీనివాస్‌ ఇంటికెళ్లారు. అక్కడ విచిత్రిమైన సన్నివేషం చోటు చేసుకుంది. తమ రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసిన వ్యక్తియే తన ఇంటికి రావడంతో కాట శ్రీనివాస్‌ గౌడ్‌ సతీమణీ, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుధారాణి ఆగ్రహాంతో ఊగిపోయిన పరిస్థితి. మంత్రి సురేఖ ఎదుటే నీలం మధు చెంప పగలగొట్టాలని పిస్తుం దంటూ సుధారాణి ఆవేశం వ్యక్తం చేశారంటే ఆమె ఎంత బాధ, కోపంతో ఉన్నారో అర్ధం కానిదికాదు. అసెంబ్లీ ఎన్నిక ల వేళ వ్యక్తిగత దూషణలకు దిగిన వ్యక్తితో ఎలా కలిసి పని చేయాలంటూ మంత్రితో తమ అయిష్టాన్ని వ్యక్తం చేసిన కా ట దంపతులు ఏ మేరకు నీలం మధుతో కలిసి పనిచేస్తారనేది వేచి చూడాలి. తుక్కుగూడలో నిర్వహించే జన జా తర సభకు జన సమీకరణ చేసేందుకు నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో నీలం మధు, కాట శ్రీనివాస్‌లు చేతులు కలిపడం విశేషం. డబుల్‌ సూటర్స్‌గా పనిచేస్తామంటూ నీలం మధు ప్రకటించగా కలహాలు వీడది కలిసిపోయామంటూ కాట శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు. వీరిద్దరి కలయి కను కిందిస్థాయి క్యాడర్‌ ఏ మేరకు స్వీకరిస్తుందో చూడాలి మరి.
ఏడు నియోజకర్గాల్లో బుజ్జగింతలే..
నీలం మధు కాంగ్రెస్‌ పార్టీలో చేరడం కొత్త కావడంతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ స్థానియ నాయకత్వాన్ని బుజ్జగించడం, మద్దతివ్వాలని కోరడంతోనే సరిపోతుంది. అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయన నర్సాపూర్‌, గజ్వేల్‌, సిద్దిపేట, దుబ్బాక, మెదక్‌ నియోజకవర్గాలకు వెళ్లి నాయ కుల్ని కలిసొచ్చారు. మైనంపల్లి హనుమంతారావు, ఎమ్మెల్యే రోహిత్‌రావు, నియోజకవర్గ ఇంచార్జీలు ఆవుల రాజిరెడ్డి, తూ కుంటా నర్సారెడ్డి, చెరుకు శ్రీనివాసరెడ్డి, పూజల హరికృ ష్ణ ను కలిసొచ్చారు. మెదక్‌లో తప్ప ఆరు నియోజక వర్గాల‌నూ కాంగ్రెస్‌ నాయకులు ఓడిపోయి ఉన్నారు. వీరం తా కూడా చేతినిండ పైకం అందితే తప్ప కదిలి పనిచేయని పరి స్థితి ఉందని స్థానిక నాయకత్వం అభిప్రాయపడుతుంది. ని యోజకవర్గ, మండల స్థాయి నాయకుల్ని మచ్చిక చేసు కుం టే తప్ప క్షేత్రస్థాయి క్యాడర్‌ కదిలి పనిచేయడం వీలుకాదు.
నాయకత్వం ఓసీలు.. ఆశ బీసీ ఓటర్లపై
ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీలో ఓసీ నాయక త్వముంది.పటాన్‌చెరులో మాత్రమే బీసీ నాయకుడు ఇంచార్జీగా ఉన్నారు. నీలం మధు మాత్రం బీసీ ఓటర్లపై ఆశలు పెట్టుకున్నారు. ఓసీ నాయకత్వాన్ని మచ్చిక చేసుకుని ముందుకు వెళ్లకపోతే బీసీ ఓటర్లను కాంగ్రెస్‌ వైపు తిప్పడం వీలుకాదు. పూర్తిగా ఓసీల వెంట తిరిగితే బీసీ ఓటర్లు సహాక రిస్తారో లేదో అన్నది మిమాంశగా మిగిలుతుంది. ముఖ్యంగా ముదిరాజ్‌ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. అందుకే నీలం మధుకు ఎంపీ టికెట్‌ ఇచ్చారని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. ఓసీ నాయకుల్ని బీసీ ఓటర్లను సమన్వయం చేస్తూ ముందుకు పోతే తప్ప నీలం మధు అనుకున్న లక్ష్యం చేరడం కష్టమనే చెప్పాలి.

Spread the love