– 10 ఏళ్ళల్లో కేసిఆర్ దొచుకుందంతా కక్కిస్తాం
– చర్లపల్లి జైల్లో కేసిఆర్ కి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తాం
– భూ బకాసురుడు సీఎం కేసీఆర్
– బక్కొనికి బుక్కెడు బువ్వ, రెండు పెగ్గులు
– మామ, అల్లుళ్ళు కలిసే దుబ్బాకను దోచుకుండ్రు
– నీతి, నిజాయితీకి మారు పేరు చెరుకు ముత్యంరెడ్డి
– దుబ్బాకకు పట్టిన శని సీఎం కేసీఆర్ కుటుంబమే
– అమెరికాలో బాత్రూమ్ లు కడిగే వ్వక్తిని తెచ్చి మంత్రిని చేసిండు. .
– వచ్చే నేల నుండి కేసీఆర్ కు ఫించన్ ఇస్తాం. .
నవతెలంగాణ దుబ్బాక/దుబ్బాక రూరల్: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా, తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ ను చెర్లపల్లి జైలుకు పంపిస్తామని, అందులోనే కేసిఆర్ కు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏద్దేవా చేశారు. గురువారం దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి విజయభేరీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదేండ్లలో సీఎం కేసిఆర్ అవినీతి అక్రమాలతో సంపాదించుకున్న వెయ్యి కోట్ల రూపాయలను కక్కిస్తామని అన్నారు. కేసిఆర్ బక్కొడు కాదు బకాసురుడనీ రేవంత్ రెడ్డి విమర్శించారు. చర్లపల్లి జైల్లోకి వెళ్ళే కేసిఆర్ తో పాటు కేటీఆర్, కవిత, హరిష్ లకు చోటు ఉంటుందని జోస్యం చెప్పారు. దుబ్బాక అభివృద్ధి పథంపై నడవలంటే నవంబర్30 న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి చెరుకు శ్రీనివాస్ రెడ్డి25వేల మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. దుబ్బాక అంటే ఉమ్మడి అంధ్రప్రదేశ్ నుండి కూడా నేటి తెలంగాణ ఏర్పాటు వరకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు మాజీమంత్రి దివంగ చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక గడ్డ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నే దుబ్బాక కు రావలసిన నిధులు సిద్దిపే కు తీసుకువెళ్లున్నప్పుడు ముత్యంరెడ్డి హాయంలోనే తిరిగి దుబ్బాక కు నిధులు సమకూర్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్ఎస్ తామంటే తాము చేశామని చెప్పుకుంటూ నేడు దుబ్బాక ప్రజల ఓట్ల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఈ ఎన్నికలలో కేసీఆర్ ని బోంద పెడితే నాలుగు వేల పించన్ ఇస్తా. 10 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ వేయ్యి ఎకరాల్లో ఫాంహౌ స్ పంజాగుట్టలో కట్టుకున్నాడని ఆరోపించారు. వెయ్యి కోట్లు అక్రమంగా సంపాదించుకున్న కేసీఆర్ చిట్టాలు తమ దగ్గరున్నాయని అన్నారు. స్వర్గీయ మాజీ మంత్రి ముత్యం రెడ్డి ని ఆదర్శంగా తీసుకుని చెరుకు శ్రీనివాస్ రెడ్డి సేవ చేస్తాడన్నరు. ఈ మూడేండ్లు మీ ముందు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు కానీ మీ పోడు భూములకు, మల్లన్న సాగర్ బాధితులకు,ఈ ప్రాంత రైతుల సమస్యల మీద సుప్రీం కోర్టు వరకు కోట్లాడడమే కాకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాక మీ బిడ్డయి మీ కోసం చెరుకు శ్రీనివాస్ రెడ్డి పని చేస్తున్నాడనీ గుర్తు చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా రఘునందన్ రావును, రెండు సార్లు ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించారు. మరీ నిజాయితీగా ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలను కోరారు.
దుబ్బాకలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే తొమ్మిదేళ్లుగా సిద్దిపేటలో కొనసాగుతున్న పెత్తనం దుబ్బాకలో ఇక నడవదన్నారు. ఖచ్చితంగా దుబ్బాకను రెవెన్యూ డివిజన్, పీజీ కాలేజ్, చేనేత కార్మికులకు పవర్ లూమ్స్ తీసుకొస్తామని అంతే కాకుండా కేసిఆర్ చదివిన కామారెడ్డి లో చేనేత కార్మికుడికి ఇల్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు .దుబ్బాక అభివృద్ధి పథంపై నడవాలంటే నీతికి, నిజాయితీకి మారు పేరైన స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. నేను తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమం చేస్తా, నా ముసల్డి వండి పెడుతాడి అన్న కేసీఆర్ లక్ష కోట్లు అక్రమంగా సంపాదించడమే కాకుండా అమెరికాలో బాత్రూమ్ లు కడిగే కొడుకు కేటీఆర్ ను మంత్రిని చేసిండని, బిడ్డను ఎమ్మెల్సీ చేసి అల్లున్ని మంత్రి, సడ్డకుని కొడుకును ఎంపీని చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిండని విమర్శించారు. దుబ్బాక అంటే ఉమ్మడి అంధ్రప్రదేశ్ నుండి నేటి తెలంగాణ ఏర్పాటు వరకు ప్రత్యేక గుర్తింపు ఉందని , ఈ గుర్తింపు ముత్యంరెడ్డితోనే వచ్చిందన్నారు. ప్రాంతం నుంచి వచ్చిన నాయకులు మాజీ మంత్రి దివంగత చెరుకు ముత్యం రెడ్డి దుబ్బాక గడ్డ కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దుబ్బాక కు రావలసిన నిధులను అప్పటి ఎమ్మెల్యే కేసీఆర్ సిద్దిపేటకు ముత్యం రెడ్డిని మోసం చేసి తరలించుక పోయాడని, అల్లుడు హరీష్ రావు రామలింగన్నను మోసం చేసి నిధులను సిద్దిపేటకు తీసుకెళ్ళాడనీ ఆరోపించారు. మామ అల్లుళ్ళు కలిసి దుబ్బాక ప్రజలను మోసం చేసిన చరిత్ర ఉందన్నారు.
ముత్యంరెడ్డి హాయంలోనే తిరిగి దుబ్బాకకు నిధులు సమకూర్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడని గుర్తుచేశారు. రైతులను మోసం చేసిన గజదొంగ హరీష్ రావు . కొత్త ప్రభాకర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి సవాల్. యువత జోలికొస్తే ఫరూక్ నీ బట్టలు ఊడదీసి తరిమికొట్టడం అన్నారు.. దుబ్బాకలో సిద్దిపేటలో పెత్తనం ఇక సాగదు –కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిచె ఱకు శ్రీనివాస్ రెడ్డి వడ గండ్ల వర్షానికి నష్టపోయిన రైతులకు రూ.1000 వేలు నష్ట పరిహారం ఇస్తానని మోసం చేసిన గజ దొంగ హరీష్ రావ్ సిద్దిపేటోళ్లకు వారం రోజుల్లోగా ఇచ్చారని, ఇక్కడి రైతులకు అన్యాయం చేసిన హరీష్ దుబ్బాక లో ఎన్నికల ప్రచారానికి ఎందుకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ముత్యం రెడ్డి ఆశయ సాధన కోసం రాజకీయాల్లోకి వచ్చానని, 30 సంవత్సరాల కింద ఉన్న వివక్ష మళ్ళీ దుబ్బాక లో మొదలైందన్నారు.దుబ్బాక లో సిద్దిపేటోల్ల పెట్టనం సాగదని తేల్చి చెప్పారు. దుబ్బాక లో ఏర్పాటు చేసిన విజయభేరీ సభలో మాట్లాడారు. యువతకు ఉద్యోగావకాశాలు ఇవ్వలేని ప్రచారంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుసేన్ నీ నిలదీసిన యువతను బెదిరించిన నిన్ను దుబ్బాక లో మల్లోసరి అడుగు పెట్టనివ్వమని, దుబ్బాక లో రాజకీయం చేసింది చాలు కానీ ఇక నీ రాజకీయాలు ఏమైనా ఉంటే సిద్దిపేటలోనే చేసుకోవాలని యువత జోలికొస్తే నీ బట్టలు ఊడదీసి తరిమికొట్టడం ఖాయమని హెచ్చరించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెమరీ లాస్ అని, ఎంపీ సొంతూరైన కామారెడ్డి జిల్లా తుజాల్పూర్ లో వారీ అన్నను సర్పంచ్ గా గెలిపించడానికి స్కూల్, డబుల్ బెడ్ రూమ్, కళ్యాణమండపం కట్టిస్తానని చెప్పి సొంత ఊరికే అన్యాయం చేశాడని ఇక దుబ్బాకలో గెలిచి ఇక్కడి నియోజకవర్గం ప్రజలకు ఏం చేస్తారో మీరే ఆలోచించుకోవాలని అన్నారు. ఎంపీ పూర్వీకుల భూమిలో 470 ఎకరాల్లో నిర్మించింది చెరుకు ముత్యం రెడ్డి అని ఇది వాస్తవం కాకుంటే తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు.ముత్యం రెడ్డి కట్టిన చెక్ డ్యాంలు వల్లే రైతులకు సాగు నీరు అందుతున్నాయి కొత్త ప్రభాకర్ రెడ్డి పై చేసిన కత్తిపోటు దాడి మేమే చేశామని ప్రచారం చేస్తున్న కేటీఆర్ అసత్య ప్రచారాలు నమ్మొద్దని , ముత్యం రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేసే తనకు మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని చెఱకు శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు