గజ్వేల్‌లో కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు

నవతెలంగాణ గజ్వేల్‌: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను కేసీఆర్ అందజేశారు.  అనంతరం ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు.

Spread the love