తెలంగాణలో శుక్రవారం భారీ వర్షాలు..!

శుక్రవారం భారీ వర్షాలు
శుక్రవారం భారీ వర్షాలు

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం, శనివారం భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం భారీ వర్షాలు కురిసే జిల్లాలివీ..

ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Spread the love