విద్యారంగ సమస్యల పరిష్కారంకై ఎస్ఎఫ్ఐ సమరభేరి జీపు జాత 

మండలంలో విద్యారంగ సమస్యలపై మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
మండలంలో విద్యారంగ సమస్యలపై మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
– మండలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ వీర్నపల్లి  
విద్యా రంగ సమస్యలను పరిష్కారం కోసమే ఎస్ ఎఫ్ ఐ జీపు జాత ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని సమరభేరి జీపు జాత జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. జిపూ జాత గురువారం వీర్నపల్లి మండలానికి చేరుకుందనీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ సమరభేరి జిపు జాత పలు మండలాలు తిరుగుతూ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ విద్యార్థుల సమస్యల పైన సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు.                                                      
అనంతరం మోడల్ స్కూల్లో విద్యార్థులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల పైన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయడం లేదని ఖాళీ ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని పెండింగ్ పాఠ్యపుస్తకాలు యూనిఫాం లు అందించాలన్నారు.  ప్రతి మండలానికి ఒక రెగ్యులర్ ఎంఈఓ నియమించాలన్నారు. యాత్ర బృందానికి విద్యార్థులు పలు సమస్యలు ముఖ్యంగా వీర్నపల్లి కేజీబీవీకి వెళ్లడానికి రోడ్డు సౌకర్యం లేదని వర్షాకాలంలో పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని రోడ్డుకిరువైపులా వీధిలైట్లు అమర్చాలని ,మోడల్ స్కూల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని, బాత్రూంలో సమస్యలు, మోడల్ స్కూల్ వసతి గృహంలో త్రాగునీటి సౌకర్యం, బాత్రూం సమస్యలు, విద్యార్థులు తమ సమస్యలను యాత్ర బృందానికి తెలియజేశారు.
ఈ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు మనోజ్ కుమార్, కుర్ర రాకేష్, నాయకులు ఆదిత్య ,రామ్ చరణ్ సాయి చరణ్ ,వేణు, అభిషేక్, నాగరాజ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love