2006-2007పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నవతెలంగాణ-వీణవంక

వీణవంక మండల ప్రాథమిక కొన్నత పాఠశాల లో పూర్వ విద్యార్థులు 2006-2007 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం వీణవంక లో ఘనంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్ధులు చెప్పిన నాటి గురువులను పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు అందరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు తమ గతస్మృతులన నెమరువేసుకుంటూ తాము చదువుకున్న పాఠశాలలో కలసి తిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. తమ విద్య, వైవాహిక, ఉద్యోగ జీవిత విశేషాలు కుటుంబ నేపథ్యాల విషయాల గురించి ఒకరికొకరు తమపిల్లలు చదువుల గురించి వివరాలు చెప్పుకుంట ఎంతో ఆనందోత్సాహాలతో గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ హెచ్ఎం భావన ఋషి సౌందర్య , కుమార స్వామి, కొమురవెల్లి రవీంద్ర చారి రాజమల్లు కౌసల్య రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Spread the love