నీట మునిగిన భూ పోరాట కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ(ఎం) నాయకులు

నవతెలంగాణ – కంటేశ్వర్
నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలు నీట మునిగాయి. ఈ భూ పోరాట కేంద్రాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్యాల గోవర్ధన్ జిల్లా కమిటీ సభ్యురాలు బెజగం సుజాత లు గురువారం సందర్షించారు. నీటిని తొలగించేందుకు సహాయక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వరద సభ్యులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు మల్యాల గోవర్ధన్, సుజాత లు మాట్లాడుతూ.. వర్షం కారణంతో నీట మునిగిన ఇండ్ల బాధితులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది, ప్రజలు మాత్రం ఇండ్లు నీట మునిగిన స్థలాలను మాత్రం విడిచేది లేదని పోరాటాన్ని రెట్టింపు ఉత్సాహంతో ఉదృతం చేస్తామని అన్నారు, అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని, త్రాగునీరు కరెంటు తదితర మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల స్థలాల సాధన పోరాట కమిటీ నాయకులు కళావతి, భాస్కర్, రాజు, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love