గ్రామపంచాయతీ సమ్మె పోస్టర్లు ఆవిష్కరణ!

–  జూలై 6 నుండి సమ్మె ను జయప్రదం చేయండి జేఏసీ సిఐటియు ఐఎఫ్టియు నాయకుల పిలుపు

నవతెలంగాణ – కంటేశ్వర్
గ్రామపంచాయతీ సమ్మె పోస్టర్ను జులై 6 నుండి సమ్మెను జయప్రదం చేయాలని జేఏసీ సిఐటియు ఐఎఫ్టియు నాయకులు పిలుపునిస్తూ సోమవారం ఆవిష్కరించారు.సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసు, మాట్లాడుతూ రాష్ట్రంలోని 12769 పంచాయతీలో పనిచేస్తున్న 50000 మంది ఉద్యోగ కార్మికుల వేతనాలు పెంచి వెంటనే పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు సాధారణ మరణానికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాలని, కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ చట్టాలను వర్తింపజేయాలని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. దండాలు పెట్టి సన్మానాలు చేస్తే, కార్మికుల ఆకలి సమస్య తీరదని వారు అన్నారు. స్వస్తి తెలంగాణలో ముందు వరసలో ఉన్న పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేఏసీ చేస్తున్న సమ్మెను మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని వెంటనే చర్చలు జరిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమ్మె పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్ గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి జంగం గంగాధర్ జిల్లా నాయకురాలు పద్మ  ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కాజా మొయినుద్దీన్, జేపనాయకులు పాషా బాయ్, హుస్సేన్ సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love