వానమ్మ.. రావమ్మ

నవతెలంగాణ- రాజంపేట్
గత వారం రోజులుగా ఎండలు తీవ్రంగా మారాయి. మొదట్లో జోరుగా పడిన వానలు ప్రస్తుతం ఆశించినంత స్థాయిలో పడడం లేదు. మండలంలో రైతులు మొదట్లో కురిసిన వానలకు పూర్తిస్థాయిలో పత్తి,మొక్కజొన్న, సోయా విత్తనాలను ప్రధాన పొలాల్లో విత్తుకున్నారు. దీంతో రైతులు వానమ్మ రావమ్మ అని దేవుళ్లను మొక్కుకుంటున్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో విత్తిన విత్తనాలు పూర్తిస్థాయిలో మొలక ఎత్తలేదు, అదేవిధంగా మొలకెత్తిన విత్తనాలు ఎండల ఉధృతికి పూర్తిగా వాడు చూపుతున్నాయి. దీనితో వర్షాలు సకాలంలో పడతాయో పడవో అని రైతులు భయాందోళన చెందుతున్నారు.

Spread the love