ప్రభుత్వ విద్యాసంస్థలను జిల్లా కలెక్టర్ సందర్శించాలి: ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రభుత్వ విద్యాసంస్థలను జిల్లా కలెక్టర్ సందర్శించాలి అని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) నగర కమిటీ అధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి,వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పోషమైన మహేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ లో ఉన్న ప్రభుత్వ విద్యాసంస్థలు అనేక సమస్యలకు నిలయంగా మారిన, ప్రభుత్వ అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు అని అన్నారు.అలాగే మన ఊరు మన బడి పథకం పనులు కూడా నత్త నడకన సాగుతూ ఎప్పుడు పూర్తవుతయో కూడా తెలియని పరిస్థతుల్లో ఉండటం బాధాకరం అని అన్నారు.అదే విధంగా అనేక విద్యాసంస్థల్లో కనీస మౌలిక సదుపాయాలు అయిన త్రాగు నీరు, విద్యుత్ సదుపాయం గానీ మరియు విద్యార్ధులకు సరిపడా బత్రూమ్స్ కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న పట్టించుకునే నాథుడే లేరని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించి ,సమస్యల పరష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు విశాల్ నగర నాయకులు కిరణ్, సాయి, తరుణ్, మనోజ్, రేహన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love