పాఠశాల బోధన అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి..

నవతెలంగాణ- కంటేశ్వర్
ఉపాధ్యాయులను పాఠశాల సర్దుబాటు చేసే క్రమంలో పాఠశాల బోధన అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి అని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వెనిగళ్ళ సురేష్, ప్రధాన కార్యదర్శి సల్లా సత్యనారాయణ శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారికి ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో కొన్ని పాఠశాలలో ప్రవేశాలు అధికంగా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఖాళీలు యధావిధిగా ఉన్నాయి. ఉపాధ్యాయ ఖాళీలు పాఠశాల బోధనకు తీవ్ర ఆటంకంగా ఉన్నాయి. పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండి, సబ్జెక్టు బోధన చేసే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు నష్టపోతున్నారు. కావున ఉపాధ్యాయులను పాఠశాలకు సర్దుబాటు చేసే సందర్భంలో విద్యా సంచాలకుల మార్గదర్శకాలను పాటిస్తూ స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఉన్న పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్న పాఠశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అవసరాల మేరకు పాఠశాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని, ఎలాంటి తప్పులకు, అపోహలుకు, రాజకీయ ఒత్తిళ్లకు అవకాశం ఇవ్వద్దని టిపిటిఎఫ్ నిజామాబాద్ జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు.

Spread the love