ఆర్డిఓ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా

నవతెలంగాణ- కంటేశ్వర్
ఇంటీరియం రీలీఫ్ ను ప్రకటించి వెంటనే పిఆర్సి కమిటీని, నియమించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. సిర్పా హనుమాన్లు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్.మదన్ మోహన్ ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లపట్ల నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తూ డి ఏ లను విడుదల చేయడంలోనూ ఆర్ధిక ప్రయోజనాలను చెల్లించేందుకు అనేక ఆటంకాలు సృష్టిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు ప్రసాద్ రావు, ముట్టరం నారసింహ స్వామి మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును పట్టిస్తాపరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో అనుమతించాలని 40 సంవత్సరాలు పాటు ప్రజల కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చే బహుమానం ఇదేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి అందే సాయిలు, కోశాధికారి రాధా కిషన్ జిల్లా నాయకులు ప్రసాద్, మార్కెటింగ్ కమిటీ శాఖ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు రాజేందర్ పూర్ణచంద్రరావు బన్సీలాల్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love