నవతెలంగాణ – ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి ధులే వెళ్తున్న ఓ భారీ ట్రక్కు వాహనాలను ఢీకొట్టి హైవే పక్కనున్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతిచెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు ఉదయం 10.45 గంటల ప్రాంతంలో పలస్నేర్ గ్రామ సమీపంలోని ఓ బస్టాప్‌కు చేరుకోగానే ట్రక్కు బ్రేక్‌లు ఫెయిలయ్యాయి. దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ట్రక్కు వాహనాలపైకి దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. రెండు బైక్‌లు, కారు, మరో కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తాపడింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.