తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్ల విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ (ఈఏపీసెట్) పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నిన్న అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్ టికెట్లను మాత్రమే విడుదల చేశారు. ఈరోజు ఇంజినీరింగ్ స్ట్రీమ్ హాల్ టికెట్లను రిలీజ్ చేశారు. మే 7 నుంచి 11వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు… మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ఎంసెట్ కోసం దాదాపు 3.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. హాల్ టికెట్లను డౌన్ లో చేసుకునేవారు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Spread the love