పీపుల్స్‌ ప్లాజాలో శారీ రన్‌.. పాల్గొన్న నారా బ్రాహ్మణి

Saree-Runనవతెలంగాన – హైదరాబాద్‌: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో ‘శారీ రన్‌’ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. చీర సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపు తీసుకురావడంతో పాటు సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. తనైరా సీఈవో అంబుజ్ నారాయణ్ మాట్లాడుతూ.. చీరలు మహిళలకు హుందాతనం, గౌరవాన్ని ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేజే యాక్టివ్ కోచ్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love