నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీ అంటే రేపటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ తరుణంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ముఖ్యంగా పదో తరగతి పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారట. అంతేకాదు కొంత కాలం నుంచి అమలులో ఉన్న నిమిషం నిబంధనను తీసేసారు. పరీక్షా కేంద్రానికి హాజరయ్యేందుకు 5 నిమిషాల గ్రేస్ ట్రైం నిఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులకు కాస్త టెన్షన్ లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం ని తీసుకుంది. ఉదయం 9.30 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఇక ఈ పరీక్షల గ్రేస్‌టైమ్ లో మార్పులు చేసారు. ఈ కారణంగా విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రం లోకి అనుమతి ఉంటుంది.