ప్రణీత్‌రావును కస్టడీకి తీసుకున్న పోలీసులు

Praneeth Raoనవతెలంగాణ – హైదరాబాద్‌: ఆధారాల ధ్వంసం కేసులో స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇందు కోసం సిబ్బంది చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. నిందితుడిని ఏడు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలిచ్చింది. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్‌ఐబీ డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్‌ రావు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని పెన్‌డ్రైవుల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్‌డిస్కులను ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Spread the love