నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి

cm-revanth reddyనవతెలంగాణ – హైదరాబాద్
నేడు ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు.ఇవాళ రాహుల్‌ గాంధీ భారత్ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు కార్యక్రమంలో కూటమి అంతా ఒకే వేదికపైకి రాబోతోంది. ఈరోజు ముంబయిలో భారీ బహిరంగ సభకు ఇండియా కూటమి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేదికపైనే కూటమి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనుంది. ఈ సభకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్ఖండ్ సీఎం చంపయి సొరెన్, తేజస్వీ యాదవ్, అఖిలేశ్ యాదవ్, దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌, సీపీఐ, నేషనల్ కాన్ఫరెన్స్, శివసేన, ఎన్సీపీ నేతలు హాజరు కానున్నారు. ఈ వేదిక నుంచే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ తరుణంలోనే.. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లనున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Spread the love