అధిక పింఛను దరఖాస్తు గడువు జులై 11 వరకు పొడిగింపు

ఢిల్లీ: ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే వేతనజీవుల అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగించారు. గతంలో ఇచ్చిన గడువు జూన్‌ 26(నేటితో) ముగియనుండటంతో జులై 11వరకు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. దీంతో వేతనజీవులు జులై 11వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు ఏర్పడింది. గతంలో మే 3వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్ 26 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు సాంకేతిక అడ్డంకులు, కచ్చితంగా జత చేయాల్సిన ఈపీఎఫ్‌వో పాస్‌బుక్‌కు సర్వర్‌ మొరాయించడం తదితర కారణాలతో అర్హులైన పింఛనుదారులు, కార్మికులు దరఖాస్తు చేసుకోలేకపోవడంతో అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగించాలంటూ గతంలో పింఛనుదారులు, కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, సీబీటీ సభ్యులు ఈపీఎఫ్‌వో కమిషనర్‌కు విజ్ఞప్తి చేయడంతో అప్పుడు పొడిగించారు.

Spread the love