నవతెలంగాణ- హైదరాబాద్: భారతీయ రైల్వే చరిత్రలోఅత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ నిర్వహిస్తున్న సంగతి విధితమే. కాగా, ప్రమాదం జరిగిన నెల రోజుల తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ అర్చనా జోషిపై ప్రభుత్వం వేటువేసింది. ఆమె స్థానంలో కొత్త జీఎంగా అనిల్ కుమార్ మిశ్రాను క్యాబినెట్ అపాయింట్‌మెంట్స్ కమిటీ నియమించింది.