దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత..

నవతెలంగాణ- హైదరాబాద్: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్దకు శని త్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. అయితే, శని దోషం కోసం తైలాభిషేకం చేయిస్తుండగా.. ఆయనకు కళ్లు తిరిగి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. ఇక, వెంటనే ఆయనను సన్నిహితులు ఆలయం వద్ద కొద్దిసేపు సేద తీర్పించారు.  దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలోనూ అస్వస్థతకు గురయ్యారు.

Spread the love