నేటి నుంచి అమర్‌నాథ్ యాత్ర..

నవతెలంగాణ -జమ్మూకశ్మీర్‌: అమర్‌నాథ్‌ యాత్రకు జమ్మూకశ్మీర్‌ సర్కార్‌ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు నుంచి యాత్రికులు మంచు శివలింగం దర్శనానికి వెళ్లనున్నారు. ఈ రోజు నుంచి ఆగస్టు 31 వరకు అమర్ నాథ్ యాత్ర కొనసాగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికారులు భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్రం.. వార్షిక యాత్ర రెండు నెలలు కొనసాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు.

Spread the love