రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు..

నవతెలంగాణ – హైదరాబాద్: ఇప్పటి వరకు పది విడుతల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసింది. తాజాగా పదకొండో విడతలో భాగంగా రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వానాకాలం పంటకు సంబంధించి 70లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సారి 1.5లక్షల మంది పోడురైతులకు సైతం రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.రూ.7720.29కోట్లు జమకానున్నాయని, 1.54కోట్ల ఎకరాలకు అందతున్న రైతుబంధు సాయం అందించనున్నట్లు వివరించారు.

Spread the love