5 రోజుల శిశువు పాలు తాగలేదని.. వేడినూనెలో వేళ్లు కాల్చిన తల్లి

నవతెలంగాణ – ఉత్తర్‌ప్రదేశ్‌
బిడ్డ పాలు తాగడం లేదని మూఢ నమ్మకాలతో వేడినూనెలో ఆ చిన్నారి వేళ్లు ముంచింది ఓ తల్లి. ఈ దారుణమైన ఘటన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే జరగడం గమనార్హం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లా ఫతేపుర్‌ ప్రాంతం ఇస్రౌలి గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌, ఆసియా బానో దంపతులకు ఈ నెల 11న ఫతేపుర్‌ ఆరోగ్యకేంద్రంలో పండంటి మగబిడ్డ పుట్టాడు. మొదటి 3-4 రోజులు ఆరోగ్యంగా ఉన్న చిన్నారి.. ఆ తర్వాత తల్లి పాలు తాగకపోవడంతో ఆసియా తీవ్ర ఆందోళనకు గురైంది. ఏమిచేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఆమె ఆసుపత్రి సిబ్బంది ఒకరు ఇచ్చిన వెర్రి సలహాతో ముందూవెనకా ఆలోచించకుండా వేడి వేడి నూనెలో బిడ్డ వేళ్లను ముంచింది. రాత్రిళ్లు విధుల్లో ఉన్న నర్స్‌ దీన్ని గుర్తించి వైద్యుడికి ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నారికి వైద్యం చేసిన వైద్యుడు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లలు పాలు తాగక గతంలో ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఆసియా ఆ భయంతోనే ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని సమాచారం.

Spread the love