మ‌హారాష్ట్ర‌లో పాల్ఘ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం..

నవతెలంగాణ – హైదరాబాద్ : మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. న‌ల‌స‌పోరా ప్రాంతంలోని రెస్టారెంట్‌లో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురికి గాయాల‌య్యాయి. ఘ‌ట‌నా స్ధలానికి అగ్నిమాప‌క యంత్రాల‌ను ర‌ప్పించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చేందుకు సిబ్బంది శ్ర‌మిస్తున్నారు. స‌హాయ కార్య‌క్ర‌మాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయ‌ని అధికారులు తెలిపారు. ప్రాథ‌మిక ద‌ర్యాప్తు అనంత‌రం అగ్నిప్ర‌మాదానికి కార‌ణాల‌తో పాటు మ‌రిన్ని వివ‌రాలు వెలుగుచూస్తాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.

Spread the love