రూ. 2 వేల నోటు చెల్లుబాటుపై మరింత స్పష్టతనిచ్చిన ఆర్బీఐ గవర్నర్

నవతెలంగాణ – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ. 2,000 నోటును సెప్టెంబరు 30వ తేదీ వరకు ఉపసంహరించుకోవచ్చని భారతీయ రిజర్వు బ్యాంకు స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత వీటి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత వచ్చింది. సెప్టెంబరు 30 వరకు నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఇచ్చినా ఆ తర్వాత ఆ నోటు చెల్లుబాటు కాదని తాము ఎక్కడా చెప్పలేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. కాకపోతే, ఆ తేదీలోపు మార్చుకోవాలని మాత్రమే పేర్కొనట్టు తెలిపారు. గడవు పెట్టకపోతే నోట్ల మార్పిడి సీరియల్‌లా సాగుతుందని, అందుకనే సెప్టెంబరు 30 గడవు విధించినట్టు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ఏం చేయాలన్నదానిపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, రూ. 1000 నోటును మళ్లీ తీసుకొచ్చే ప్రతిపాదన కూడా ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు.

Spread the love