హైకోర్టులో ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌..

నవతెలంగాణ – హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ తరుణంలో ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని అవినాష్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని హైకోర్టును ఆయన కోరారు. ఎంపీ అభ్యర్థనపై మధ్యాహ్నం 2.30గంటలకు హైకోర్టు విచారణ జరపనుంది. ఈ క్రమంలో పులివెందుల నుంచి హైదరాబాద్‌కు ఆయన బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరగనుంది.

Spread the love