రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ లక్ష్యం: రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ, అమిత్‌షా ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకు రారనీ, రిజర్వేషన్లు రద్దు చేస్తే వారంతా ఒకటే అనే భావన కలుగుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. 2025 నాటికి ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే దాని లక్ష్యమని చెప్పారు. ఆ దిశగా భాజపా అడుగులు వేస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని, అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోడీ పదేపదే కోరుతున్నారని విమర్శించారు.

Spread the love