పార్లమెంటులో మీ గొంతు వినిపించాలంటే రఘువీరారెడ్డిని గెలిపించాలి…

– మతోన్మాద శక్తి మోడీ నీ చిత్తుగా ఓడించాలి
– కమ్యూనిస్టులు కలిసి రావడం అభినందనీయం
– ఎంపీగా పార్లమెంటులో బిజెపిని గడగడలాడించా…
–  మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి…
నవతెలంగాణ కోదాడరూరల్: పార్లమెంటులో మీ గొంతు వినిపించాలంటే రఘువీరారెడ్డిని గెలిపించాలి అని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ మతతత్వ ఫాసిస్టు విధానాలకు గుణపాఠం చెప్పి చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. భారతదేశంలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని రికార్డు స్థాయి మెజార్టీలో గెలిపించాలన్నారు .అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ అభ్యర్థి పద్మావతిని రికార్డు మెజార్టీతో గెలిపించారని కార్యకర్తలకు నాయకులకు రుణపడి ఉంటామన్నారు. తాను ఎంపీగా పార్లమెంటులో నల్లగొండ ప్రజల గొంతు వినిపించానన్నారు. హైవే కోసం, రైల్వే కోసం, ధాన్యం కొనుగోళ్ల కోసం, పార్లమెంటులో బాని వినిపించి మోడీ ప్రభుత్వాన్ని గడగలరాడించానన్నారు. 94 నుండి కోదాడ నియోజకవర్గం లో 30 ఏళ్ల పాటు మీ ఆదరాభిమానాలతో తాము కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నామన్నారు. మీ గుండెల్లో ప్రేమాభిమానాలతో జీవిస్తున్నామన్నారు. తమది రాజకీయ సంబంధం కాదని ఈ నియోజకవర్గ ప్రజలతో కుటుంబ సంబంధం అన్నారు.


కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. మే 13న జరిగే ఎన్నికల వరకు నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అతి పెద్ద మెజార్టీతో గెలిపించాలన్నారు. రఘువీర్ రెడ్డి పార్లమెంటులో నీ గొంతును వినిపించి నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కలిసి రావడం అభినందనీయమన్నారు .కమ్యూనిస్టులతో ఎప్పటికీ తనకు సత్స్ సంబంధాలు ఉంటాయన్నారు. కమ్యూనిస్టులు అడిగే ప్రతి పనిని చేస్తామన్నారు .రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపిగా గెలిపిస్తే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. పార్లమెంటులో నల్లగొండ ప్రజల గొంతుకనవుతానన్నారు .కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర పాలన దొరుకుతుంది అన్నారు. ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ రావాలన్నారు. మాజీ మంత్రి జానారెడ్డి ,మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు కమ్యూనిస్టు నాయకులు గన్న చంద్రశేఖర్ బెజవాడ వెంకటేశ్వర్లు ,నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా నియోజకవర్గ వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నంత సేపు కార్యకర్తలు చప్పట్లతో సభా ప్రాంగణంలో మారుమోగించారు. ఈ సమావేశంలో టి పి సి సి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్, ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, సీనియర్ నాయకులు బాబు, ముత్తవరపు పాండురంగారావు, జడ్పిటిసి కృష్ణకుమారి ,వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్లు, పలు మండలాల మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love