ప్రారంభమైన సార్వత్రిక సమరం..

నవతెలంగాణ హైదరాబాద్: దేశ తొలి సార్వత్రిక ఎన్నికల తరువాత మళ్లీ అంతటి సుదీర్ఘ సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 44 రోజుల పాటు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే, ఆ కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేయడంతో ఈ సమరం అన్నివర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Spread the love