డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల పాలిట శాపమైన అల్మానక్  విధానాన్ని రద్దు చేయాలి

– రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్
నవతెలంగాణ – అచ్చంపేట 
గెస్ట్ లెక్చరర్లను పూర్తి అకాడమిక్ ఇయర్ కు ఎంపిక చేసుకుని యూనివర్సిటీల అల్మానక్ ప్రకారం గా సంవత్సరంలో 6 ,7 నెలల కు మాత్రమే పని చేయించుకుని ఆ తర్వాత మీ దారి మీదే మా దారి మాదే అనే తీరు డిగ్రీ గెస్ట్ లెక్చరర్ల పాలిట శాపమైన అల్మానక్  విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొర్ర ఈశ్వర్ లాల్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.  విద్యార్థులకు ప్రిపరేషన్ హాలిడేస్, ఫెస్టివల్ హాలిడేస్, ఎగ్జామ్స్ జరుగుతున్నాయనే కారణంగా గెస్టు లెక్చలర్ల సేవలకు విరామం ఇవ్వడం,  పాఠాలు బోధిస్తానే పైసలిస్తామనే విధానం ఉన్నత విద్యావంతులను అవమానించడమే నని అన్నారు. ఈ విధానం వల్ల సంవత్సరంలో ఐదు నెలలు వేరే పని చేసుకోలేక విద్య బోధనే తమ కర్తవ్యం గా భావించే గెస్ట్ లెక్చలర్లను ప్రతి సంవత్సరం త్రీ మెన్ కమిటీలతో డెమోల ద్వారా శీల పరీక్ష చేసే విధానం ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. ఒకే రాష్ట్రంలో వేరే విద్యాసంస్థలలో అనుసరించని పద్ధతిని కేవలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విధానాన్ని అమలు చేయడం ఉన్నత విద్యావంతులైన డిగ్రీ గెస్ట్ లెక్చలర్లను వివక్షతతో చూడడమే నని అన్నారు.
కయూనివర్సిటీల అల్మానక్ ప్రకారం గా కాకుండా ఆటో రెన్యువల్ తో కంటిన్యూ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 145 డిగ్రీ కళాశాలలో 1600 పైగా గేస్ట్ లెక్చరర్ లు పనిచేస్తున్నారు.  గత పది సంవత్సరాల నుండి ఈ విధానంలో పని చేస్తూ ఉన్నత విద్య వ్యవస్థ ను కాపాడడంలో  ప్రధాన భూమిక పోషిస్తూ 70 శాతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు గెస్ట్ లెక్చలర్లతోనే నడుస్తున్నాయి.  మా ప్రధాన డిమాండ్ ప్రస్తుతం పనిచేస్తున్న గేస్ట్ లెక్చరర్ లందరినీ ఆటో రెన్యువల్ చేయాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా 12 నెలలకు కంసాలిడేటెడ్ పే ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ పి బాలరాజు, ట్రెజరర్ శివ కుమార్, జిల్లా ఉపాధ్యక్షురాలు గాయత్రి, జిల్లా సెక్రటరీ వెంకటస్వామి, కళాశాల అధ్యక్షులు డాక్టర్ కృష్ణ గోపాల్ ,ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్,గోపాల్,మల్లయ్య, ముంతాజ్ ఉన్నారు.
Spread the love