నీకు దమ్ము ఉంటే మా ఎమ్మెల్యే లను టచ్ చేసి చూడు : రేవంత్ రెడ్డి

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌: షెడ్డు నుంచి కారు ఇక బయటకు రాదు.. అది పాడైపోయిందని బీఆర్ఎస్ ను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు.  కేసీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను టచ్‌ చేస్తే.. మాడి మసైపోతావు. పాలమూరులో అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా బీఆర్ఎస్ ను ఓటు వేయాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.

Spread the love